t-dgp: తెలంగాణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం: డీజీపీ మహేందర్ రెడ్డి

  • ఎలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు 
  • ప్రతి పోలింగ్ స్టేషన్ లో పోలీసులు ఉంటారు
  • తెలంగాణలో మావోయిస్టులు చొరబడే అవకాశమే లేదు

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. సంబంధిత శాఖల సమన్వయంతో ఎన్నికల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని, ప్రతి పోలింగ్ స్టేషన్ లో పోలీసులు ఉంటారని చెప్పారు. తెలంగాణలో మావోయిస్టులు చొరబడే అవకాశమే లేదని, ఒకవేళ వాళ్లు చొరబడేందుకు యత్నిస్తే తిప్పి కొడతామని స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని, సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరింపజేస్తామని చెప్పారు.
 

t-dgp
mahender reddy
Telangana
  • Loading...

More Telugu News