Sri Lanka: బంతి తగిలి మైదానంలో కుప్పకూలిన శ్రీలంక క్రికెటర్ నిస్సాంకా

  • లంక బోర్డ్‌ ఎలెవన్ తో ఇంగ్లండ్‌ జట్టు ప్రాక్టీస్‌ మ్యాచ్‌
  • బలమైన షాట్ కొట్టిన జోస్ బట్లర్
  • షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న నిస్సాంకా
  • హుటాహుటిన ఆసుపత్రికి

లంక బోర్డ్‌ ఎలెవన్ తో ఇంగ్లండ్‌ జట్టు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతున్న వేళ, శ్రీలంక క్రికెటర్‌ పాతుమ్‌ నిస్సాంకా తలకు బంతి తగిలి తీవ్ర గాయమైంది. ఇంగ్లండ్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ ఓ బలమైన షాట్‌ కొట్టగా, షార్ట్‌ లెగ్‌ లో ఫీల్డింగ్‌ చేస్తున్న నిస్సాంకా తలకు బంతి తాకడంతో, అతను కుప్పకూలి పోయాడు.

వెంటనే అతన్ని దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా నిషాన్‌ పైరిస్‌ 56వ ఓవర్‌ వేస్తున్న వేళ, రెండో బంతిని జోస్‌ బట్లర్‌ షాట్‌ కొట్డాడు. అది నిస్సాంకా హెల్మెట్‌ కింది భాగాన తాకింది. ఆపై బంతి లెగ్‌ స్లిప్‌ లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఏంజెలో మాథ్యూస్‌ చేతికి చిక్కి, బట్లర్‌ అవుట్ కాగా, నిస్సాంకా ఆసుపత్రి పాలయ్యాడు.

Sri Lanka
England
Cricket
Nissanka
  • Loading...

More Telugu News