Priyanka Chopra: మెడలో రూ. 10 కోట్ల నగలతో జిగేల్మన్న ప్రియాంకా చోప్రా!

  • బ్రైడల్ షవర్ ఫంక్షన్ లో ప్రియాంక
  • మధురమైన జ్ఞాపకంగా జరిగింది
  • చాలా సంతోషంగా ఉన్నానన్న ప్రియాంక

పెళ్లి తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ, సెలబ్రిటీ జంట ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ లు పెళ్లి సందడి మాత్రం చేస్తూ బిజీగా గడుపుతున్నారు. చోప్రా బ్రైడల్ షోవర్ ఫంక్షన్ లో తాజాగా సందడి చేసిన ప్రియాంకా చోప్రా రూ. 10 కోట్ల విలువైన ఆభరణాలను అలంకరించుకుని, జిగేల్ మని మెరిసింది.

"రూల్స్‌ అన్నీ బ్రేక్‌ చేశాం. నన్ను ప్రేమించే కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఓ మధురమైన జ్ఞాపకంగా నా బ్రైడల్‌ షోవర్‌ జరిగింది. చాలా సంతోషంగా ఉంది" అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఆమె మెడలో ధరించిన వజ్రాల నక్లెస్ విలువే రూ. 8 కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో సోనాలీ బింద్రే, నీతూ కపూర్ తదితరులు కూడా హాజరయ్యారు.

Priyanka Chopra
Bridal Shower
Jewellery
  • Loading...

More Telugu News