Rakhi Sawant: చాలా నష్టాలున్నాయి... పావలా నష్టపరిహారం ఇవ్వాల్సిందే!: రాఖీ సావంత్

  • దేశవ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం
  • రాఖీ సావంత్ పై రూ. 10 కోట్లకు తనుశ్రీ దావా
  • తనుశ్రీపై 25 పైసల నష్టపరిహారం డిమాండ్ చేసిన రాఖీ

దేశవ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న వేళ, బాలీవుడ్ నటీమణులు రాఖీ సావంత్, తనుశ్రీ దత్తాల మధ్య నెలకొన్న వివాదం మరింతగా రాజుకుంది. తనను లెస్బియన్ అని, డ్రగ్స్ కు బానిసని వ్యాఖ్యానించిన రాఖీ సావంత్ పై తనుశ్రీ రూ. 10 కోట్ల దావా వేయగా, తాజాగా రాఖీ కూడా తనుశ్రీపై పరువునష్టం దావా వేసింది.అయితే, తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఆమె నుంచి 25 పైసల నష్ట పరిహారం ఇప్పించాలని రాఖీ కోర్టును ఆశ్రయించింది.

"నేను ఆర్థికంగా భారీ నష్టాల్లో ఉన్నాను. భారీగా నష్టపరిహారం కోరి మరిన్ని కష్టాల్లో పడలేను. ఎన్నో ఏళ్లుగా కాపాడుకున్న నా పరువు మర్యాదలను తనుశ్రీ నాశనం చేయాలని చూస్తోంది. ఆమె వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకే ఈ దావా" అని రాఖీ వ్యాఖ్యానించింది. డబ్బు కోసం రాఖీ ఎంతకైనా దిగజారుతుందని, నీచమైన పనులకు పాల్పడుతుందని తనుశ్రీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Rakhi Sawant
Tanusri Datta
Bollywood
MeToo India
  • Loading...

More Telugu News