maruthi rao: వరంగల్ సెంట్రల్ జైలుకు మారుతీరావు తరలింపు.. ఏడాది పాటు అక్కడే!

  • వరంగల్ సెంట్రల్ జైలుకు ముగ్గురు నిందితుల తరలింపు 
  • ఏడాది పాటు సెంట్రల్ జైల్లో ఉండనున్న నిందితులు
  • ముగ్గురుకీ వేర్వేరు బ్యారక్ లు కేటాయింపు

ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులైన మారుతీరావు, అబ్దుల్ కరీం, శ్రవణ్ కుమార్ లను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. రాష్ట్ర జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ మురళీబాబు, మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ హత్య కేసులో నిందితులైన ఆరుగురిలో ముగ్గురు వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. వారిని మిర్యాలగూడ నుంచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. సంవత్సర కాలం పాటు వీరు ముగ్గురూ సెంట్రల్ జైల్లో ఉంటారు. ముగ్గురుకీ వేర్వేరు బ్యారక్ లు కేటాయించారు. ఈ కేసులో ఏ1గా మారుతీ రావు, ఏ5గా కరీం, ఏ6గా శ్రవణ్ ఉన్నారు.

maruthi rao
pranay
miryalaguda
warangal
central jail
  • Loading...

More Telugu News