Chandrababu: 'బచ్చా' అఖిలేశ్ పిలిచాడని బాబు పరుగులు!: జీవీఎల్ ఎద్దేవా

  • 1978లో ఎమ్మెల్యే, 1980లో మంత్రి చంద్రబాబు
  • అప్పుడు 5 ఏళ్ల వయసులో డైపర్లు వేసుకుంటున్న అఖిలేష్
  • చిటికేస్తే ఢిల్లీకి వెళ్లడం సిగ్గనిపించడం లేదా?: జీవీఎల్

నేటి చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు సెటైర్ వేశారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో స్పందించిన జీవీఎల్, అఖిలేష్ చిటికేస్తే ఢిల్లీకి వెళ్ళటం సిగ్గనిపించటం లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు 1978లో ఎంఎల్ఏ,1980లో మంత్రి అని గుర్తు చేసిన ఆయన, ఆ సమయంలో అఖిలేష్ యాదవ్ 5 ఏళ్ల వయసున్న బాలుడని, డైపర్లు వేసుకునే వయసులో ఉన్నాడని అన్నారు. అందరి కన్నా సీనియర్ నని అని చెప్పుకునే చంద్రబాబుకు 'బచ్చా' అఖిలేష్ చిటికేస్తే ఢిల్లీకి వెళ్ళటం సిగ్గనిపించటం లేదా? ఇది తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కించపరచడం కాదా? అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

Chandrababu
Akhilesh Yadav
GVL
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News