Telangana: హైదరాబాద్ లోని ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరికి తీవ్రగాయాలు!

  • శంకర్ నగర్ లోని ఓ భవనంలో ఘటన
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు
  • రాత్రిపూట గ్యాస్ లీకైనట్లు అనుమానం

హైదరాబాద్ లో ఈ రోజు దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి శంకర్ నగర్ లో ఉన్న ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అంతేకాకుండా ఇంట్లోని ఫర్నీచర్ మొత్తం ధ్వంసమైంది.

శంకర్ నగర్ లో ఉన్న మూడు అంతస్తుల భవనంలో ప్రియ అనే యువతి తన తల్లిదండ్రులతో మొదటి అంతస్తులో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం టిఫిన్ చేసేందుకు ప్రియ తల్లి కిచెన్ లోకి వెళ్లింది. అయితే రాత్రిపూట గ్యాస్ లీక్ కావడం గమనించని ఆమె స్టవ్ వెలిగించేందుకు యత్నించడంతో మంటలు ఒక్కసారిగా ఇళ్లు మొత్తం వ్యాపించాయి.

రాత్రిపూట తలుపులు, కిటికీలన్నీ మూసేయడంతో గ్యాస్ బయటకు వెళ్లకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో ప్రియతో పాటు ఆమె తండ్రి జనార్దన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. పేలుడు శబ్దం విన్న స్థానికులు వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Telangana
Hyderabad
gas
celender
leak
Fire Accident
2 injured
serious
shankar nagar
night
father
daughter
  • Loading...

More Telugu News