Prime Minister: ప్రధాని నరేంద్ర మోదీకి ఇంటి సెగ.. ఎన్నికల్లో అన్నకు వ్యతిరేకంగా తమ్ముడి ప్రచారం!

  • టీఎంసీలో చేరనున్న ప్రహ్లాద్ మోదీ
  • బీజేపీకి గట్టిమద్దతుదారుగా ఉన్న తమ్ముడు
  • కేంద్రంపై ఇటీవల విమర్శల వాడి పెంచిన ప్రహ్లాద్

ప్రధాని నరేంద్ర మోదీకి ఇంటిపోరు మొదలయింది. కుటుంబం, బంధుత్వాలు అన్నింటిని వదిలేసి దూరంగా ఉంటున్న ఆయనకు సొంత సోదరుడి నుంచే అసమ్మతి సెగ మొదలైంది. ప్రస్తుతం రేషన్ డీలర్ల జాతీయ సమాఖ్య అధ్యక్షుడైన ప్రహ్లాద్ మోదీ బీజేపీకి తలనొప్పిగా మారిన పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)లో చేరనున్నారు. 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఆయన టీఎంసీకి మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం.

ఈ విషయాన్ని టీఎంసీ పార్టీ ధ్రువీకరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. బీజేపీ ప్రభుత్వానికి తొలుత మద్దతు ఇచ్చిన ప్రహ్లాద్ మోదీ.. క్రమంగా అసమ్మతి గళాన్ని వినిపించడం మొదలుపెట్టారు. నకిలీ డిగ్రీ పొందినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Prime Minister
Narendra Modi
brother
prahlad modi
Gujarath
West Bengal
mamata benerjee
trunamool congress
TMC
bjp
contest
elelctions
  • Loading...

More Telugu News