Telangana: తెలంగాణలో మావోయిస్టుల కలకలం.. బ్యానర్లు కట్టి మందుపాతరలు పెట్టిన వైనం !

  • జయశంకర్ భూపాలపల్లిలో ఘటన
  • వెంకటాపురం రహదారిపై బ్యానర్లు
  • ఎన్నికలు బహిష్కరించాలని పిలుపు

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రేహౌండ్స్ బలగాల అణచివేతతో చాలాకాలం జాడలేకుండా పోయిన మావోలు తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బ్యానర్లు పెట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని అందులో పిలుపునిచ్చారు.

జిల్లాలోని వెంకటాపురంలో ఉన్న రహదారిపై ఈరోజు బ్యానర్లు వెలిశాయి.  ఈ ఎన్నికలను బహిష్కరించాలని అందులో పిలుపునిచ్చారు. ఈ మేరకు బ్యానర్లతో పాటు రెండు మందుపాతరలను అక్కడ మావోలు అమర్చారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం మందుపాతరలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చాలాకాలం ప్రశాంతంగా ఉన్న జిల్లాలో మళ్లీ మావోలు ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News