Vijayawada: విజయవాడలో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం... నేటి నుంచి అమలు!

  • హెల్మెట్ లేకుండా బండి నడిపితే భారీ జరిమానా
  • తొలిసారి పట్టుబడితే రూ. 1,100
  • రెండోసారి అయితే రూ. 2,100
  • మూడోసారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

విజయవాడ, కృష్ణా జిల్లాల పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. హెల్మెట్ లేకుండా బండి నడిపితే భారీ జరిమానా విధించాలని రవాణా, పోలీసు శాఖల అధికారుల సంయుక్త సమావేశంలో నిర్ణయించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. కొత్త నిబంధనలు నేటి నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు.

నేటి నుంచి హెల్మెట్ లేకుండా వాహనం నడిపి తొలిసారి పట్టుబడితే రూ. 1,100 జరిమానా విధించనున్నారు. అదే వ్యక్తి రెండోసారి పట్టుబడితే రూ. 2,100 జరిమానా విధిస్తారు. మూడోసారి పట్టుబడితే, డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తారు. మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడితే, కోర్టులో ప్రవేశపెట్టి, జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకోనున్నామని పోలీసులు తెలిపారు.

Vijayawada
Traffic
Police
Helmet
Drunk Driving
  • Loading...

More Telugu News