India: మోదీ డ్రస్సులు చూసి ముచ్చటపడ్డ దక్షిణ కొరియా అధ్యక్షుడు... ఇవ్వగానే వేసుకుని ముచ్చట!

  • గత జూలైలో మూన్ జే ఇన్ భారత పర్యటన
  • మోదీ ధరించిన జాకెట్లను మెచ్చుకున్న మూన్
  • కుట్టించి పంపించిన భారత ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ నిత్యమూ వేసుకునే జాకెట్లను చూసిన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, వాటిని ధరించి ఆనందించారు. గత జూలై నెలలో మూన్ ఇండియాకు వచ్చిన వేళ, నరేంద్ర మోదీ ధరించిన జాకెట్లను చూసి ఆయన బాగున్నాయని, చాలా అందంగా కనిపిస్తున్నాయని కితాబిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కొలతలు తీయించి, అటువంటివే తయారు చేయించిన నరేంద్ర మోదీ, వాటిని మూన్ కు కానుఅకగా పంపించారు. ఇక వీటిని అందుకున్న మూన్, వాటిని ధరించి, ఫొటో తీయించుకుని, దాన్ని ట్విట్టర్ లో పెట్టారు. ఈ జాకెట్ ఫిటింగ్ చాలా బాగుందని వ్యాఖ్యానించారు. మోదీ తరచూ స్లీవ్ లెస్ జాకెట్లను ధరిస్తుంటారన్న సంగతి తెలిసిందే.

India
South Korea
Moon J In
Narendra Modi
Jacket
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News