Jagan: నిన్నెలా చూడాలన్న యువతి.. 'జగన్‌పై దాడి చేస్తా.. టీవీలో చూపిస్తారు చూడన్న' శ్రీనివాసరావు!

  • ఫోన్‌లో పరిచయమైన మహిళ
  • కాసేపట్లో జగన్‌పై దాడిచేయబోతున్నానన్న శ్రీనివాసరావు
  • కాల్ డేటా ఆధారంగా మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. సంచలనం కోసమే అతడా పని చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తాజాగా అతడికి సంబంధించిన మరో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది.

మిస్డ్ కాల్ ద్వారా ఫోన్‌లో ఓ యువతి శ్రీనివాసరావుకు పరిచయమైంది. ఆ పరిచయం రోజూ మాట్లాడుకునే వరకు వెళ్లింది. ఓ రోజు శ్రీనివాసరావు ఆమెతోపాటు ఆమె తోడికోడలితోనూ మాట్లాడాడు. ఈ సందర్భంగా నిన్నెలా చూడాలన్న వారి ప్రశ్నకు అతడు చెప్పిన సమాధానం విని బిత్తరపోయారు.

‘‘మరికాసేపట్లో వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై దాడి చేయబోతున్నా.. టీవీలో చూపిస్తారు చూడు’’ అని చెప్పడంతో వారికి నోట మాటరాలేదు. అనుకున్నట్టుగానే జగన్‌పై శ్రీనివాసరావు దాడి చేసి సంచలనం సృష్టించాడు. శ్రీనివాసరావు ఫోన్ కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులు కనిగిరి సమీపంలోని దేవాంగనగర్‌లో ఉంటున్న మహిళ, ఆమె తోడికోడలిని పిడుగురాళ్ల తీసుకెళ్లి విచారిస్తున్నారు.

Jagan
Srinivasa Rao
YSRCP
Phone
Call Data
Guntur District
Women
  • Loading...

More Telugu News