Lakshmi Parvathi: లక్ష్మీపార్వతిని విచారించి తెలుసుకోండి: శివాజీ
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-f65a7627603e57ae04c44c6918bc3784560b580a.jpg)
- వైసీపీ, బీజేపీ ఉడత ఊపులకు రాను
- దర్యాప్తు సంస్థ రమ్మంటే వస్తా
- నాకు తెలిసింది చెప్పా
వైసీపీ, బీజేపీ ఉడత ఊపులకు తాను రానని.. దర్యాప్తు సంస్థ రమ్మంటే వస్తానని శివాజీ అన్నారు. ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో భాగంగా అమెరికా నుంచి లైవ్‌లోకి వచ్చిన ఆయన మాట్లాడుతూ.. తనను చంపేస్తారేమోనని లక్ష్మీ పార్వతి అనుమానం వ్యక్తం చేశారని.. అసలు తనను ఎవరు చంపేస్తారో ఆమెను కూర్చోబెట్టి సీబీఐ విచారణ జరపాలని శివాజీ పేర్కొన్నారు. తాను రాష్ట్రం కోసం పడే తపనను అర్థం చేసుకోలేని మూర్ఖులే తనను విమర్శిస్తారన్నారు. ఆపరేషన్ గరుడ గురించి తనకు తెలిసినపుడు హాస్యాస్పదంగా అనిపించిందన్నారు. తనకు తెలిసింది చెప్పానని ఆయన వెల్లడించారు.