Shivaji: జగన్‌ ఎపిసోడ్‌లో ఆపరేషన్‌ సక్సెస్‌..పేషెంట్‌ డెడ్: శివాజీ

  • గుమ్మడికాయ దొంగల్లా విడివిడిగా ఉండటమెందుకు?
  • ఏపీ ప్రజలకు ఏం కావాలో కాంగ్రెస్ తెలుసుకుంది
  • ఆపరేషన్ గరుడపై ప్రజలకు విశ్వాసముంది

గుమ్మడికాయ దొంగల్లా విడివిడిగా ఉండటమెందుకు? త్వరలో బీజేపీ, వైసీపీ, జనసేన కలిసిపోతాయేమో అంటూ నేడు శివాజీ అనుమానం వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో భాగంగా అమెరికా నుంచి లైవ్‌లోకి వచ్చిన ఆయన మాట్లాడుతూ.. జగన్ ఎపిసోడ్‌లో ఆపరేషన్ సక్సెస్ కానీ పేషెంట్ డెడ్ అని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలకు ఏం కావాలో కాంగ్రెస్ తెలుసుకుందని.. కాబట్టి అధికారంలోకి రాగానే హోదా ఇస్తామంటోందని పేర్కొన్నారు. ఆపరేషన్ గరుడపై ప్రజలకు విశ్వాసముందని.. తాను చెప్పింది చెప్పినట్టు జరుగుతోందని శివాజీ అన్నారు. తనను ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్లే అభాసుపాలవుతారని  ఆయన పేర్కొన్నారు. ఏపీ పోలీసులపై జగన్‌కు నమ్మకముండటం లేకపోవడం ఆయన వ్యక్తిగత వ్యవహారమని శివాజీ వెల్లడించారు.

Shivaji
Jagan
Operation Garuda
BJP
Jana Sena
YSRCP
  • Loading...

More Telugu News