Chandrababu: చంద్రబాబును ప్రశంసించిన లగడపాటి.. అనుభవమున్న నేతగా అభివర్ణన

  • గతంలోనూ చంద్రబాబును కలిసిన రాజగోపాల్
  • చంద్రబాబును ప్రశంసించడంతో రాజకీయ ప్రాధాన్యత
  • ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటారని వ్యాఖ్య

ఎన్నికలు వచ్చాయంటే రకరకాల సర్వేలు వెలుగు చూస్తుంటాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేకు ఉండే డిమాండే వేరు. ఆయన చెప్పినవన్నీ ఇప్పటివరకూ జరుగుతూనే వచ్చాయి. అయితే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తన సర్వేను త్వరలో ప్రకటిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు.

గతంలోనూ చంద్రబాబును కలిసిన రాజగోపాల్ మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. అయితే మళ్లీ ఇప్పుడు చంద్రబాబును ప్రశంసించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబును ఆయన అనుభవం ఉన్న నేతగా అభివర్ణించారు. ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటారంటూ కితాబు ఇచ్చారు.

Chandrababu
Lagadapati Rajagopal
Telangana
  • Loading...

More Telugu News