modi: మోదీపై చర్యలు తీసుకోవచ్చంటే నాపైనా తీసుకోండి?: హీరో శివాజీ

  • రాష్ట్రం కోసం నేను ఎంతో తపన పడుతున్నా
  • అది అర్థం కానీ మూర్ఖులే నన్ను విమర్శిస్తున్నారు
  • నేనేమీ మోసాలు చేయలేదు.. మంచి విషయాలే చెప్పా

తనను హతమార్చేందుకు సుపారీ ఇచ్చారని ప్రధాని మోదీ గతంలో ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవచ్చంటే..‘ఆపరేషన్ గరుడ’ గురించి చెప్పిన తనపైనా చర్చలు తీసుకోవచ్చని ప్రత్యేక హోదా సాధన సమితి నేత, ప్రముఖ నటుడు శివాజీ అన్నారు. ‘ఏబీఎన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నన్ను చంపేస్తారేమోనని లక్ష్మీపార్వతి లాంటి వాళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి, ఆమెను కూడా కూర్చోెబెట్టి అడగండి నన్ను ఎవరు చంపేస్తారో?’ అని అన్నారు. రాష్ట్రం కోసం, తెలుగుజాతి కోసం తాను ఎంత తపన పడుతున్నానో అర్థం కానీ మూర్ఖులే తనను విమర్శిస్తున్నారని, తనకు తెలిసింది చెప్పానని, అది మంచి విషయమో కాదో ఆలోచించండి అని కోరారు. ‘ఆపరేషన్ గరుడ’ గురించి మొదట తాను విన్నప్పుడు కూడా హాస్యాస్పదంగా అనిపించిందని అన్నారు. తానేమీ మోసాలు, ఘోరాలు చేయలేదని, ప్రజలకు మంచి విషయాలే చెప్పానని శివాజీ పేర్కొన్నారు.

modi
hero shivaji
lakshmi parvathi
  • Loading...

More Telugu News