Student: తన ప్రేమ వేధింపులను.. టీచర్‌కు వెల్లడించాడని తోటి విద్యార్థిపై దాడి

  • ప్రేమ పేరుతో విద్యార్థినికి వేధింపులు
  • టీచర్‌కు ఫిర్యాదు చేసిన మరో విద్యార్థి
  • కోపంతో విచక్షణా రహితంగా బ్లేడుతో దాడి

తన ప్రేమ వేధింపులను.. టీచర్‌కు వెల్లడించాడనే కోపంతో తోటి విద్యార్థిపై 9వ తరగతి విద్యార్థి బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. విజయవాడలోని చిట్టినగర్‌లోని ఓ పాఠశాలలో ప్రేమ పేరుతో 8వ తరగతి విద్యార్థినిని 9వ తరగతి విద్యార్థి వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మరో విద్యార్థి టీచర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో కోపంతో రగిలిపోయిన సదరు విద్యార్థి ఫిర్యాదు చేసిన విద్యార్థిపై బ్లేడుతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. బాధితుడికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Student
Teacher
Vijayawada
Chitti nagar
Police
  • Loading...

More Telugu News