mallikarjuna kharge: పటేల్ అంటే మాకు ఎంతో గౌరవం: మల్లికార్జున్ ఖర్గే

  • పటేల్‌ను కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు
  • ఇదంతా పొలిటికల్ స్టంట్
  • రాహుల్, సోనియా చెప్పినట్టు నడుచుకుంటా

పటేల్ అంటే తమకు ఎంతో గౌరవమని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయడంపై తాము వ్యాఖ్యానించలేమని ఆయన స్పష్టం చేశారు. అయితే మోదీజీ రాజకీయాలు చేస్తున్నారని మాత్రం స్పష్టంగా చెప్పగలమని అన్నారు. ప్రజల్లో అయోమయం సృష్టించడం, సమస్యలను పక్కదారి పట్టించడం వంటి రాజకీయాలను మోదీ చేస్తున్నారని విమర్శించారు.
దేశం కోసం అన్ని రాష్ట్రాలకు చెందిన నేతలు పోరాడారని, త్యాగాలు చేశారని, వారిని ఎందుకు స్మరించుకోవడం లేదని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. 70 ఏళ్లుగా బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ ఎందుకు వారిని స్మరించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇదంతా 'పొలిటికల్ స్టంట్' అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు చాలా తెలివైన వారని, 2019లో మంచి నిర్ణయం తీసుకుంటారని తనకు నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు. మీడియాతో బుధవారం మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

mallikarjuna kharge
sardar vallabhai patel
rahul
  • Loading...

More Telugu News