jagan: దళితులైనంత మాత్రాన జగన్ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారా?: వైసీపీ నేత మేరుగ నాగార్జున

  • మా నాయకుడి గురించి కారుకూతలు కూస్తే ఊరుకోం
  • ఆనంద్ బాబు, జవహర్, శివాజీల వ్యాఖ్యలు తగదు
  • చంద్రబాబు వద్ద వారు చప్రాసీ ఉద్యోగం చేస్తున్నారు.

వైఎస్ జగన్ పై దాడి ఘటన విషయమై సీఎం చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు తమ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని వైసీపీ ఎస్సీ సెల్ ఏపీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నక్కా ఆనంద్ బాబు, జవహర్, కారెం శివాజీలు దళితులైనంత మాత్రాన జగన్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతారా? అని ప్రశ్నించారు. దళితుల పేరిట తమ నాయకుడి గురించి కారుకూతలు కూస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అంబేద్కర్ దయతో పదవులు పొందిన మీరు చంద్రబాబు వద్ద చప్రాసీ ఉద్యోగం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

jagan
jawahar
karem sivaji
nakka anand babu
  • Loading...

More Telugu News