Allu Arjun: అల్లు అర్జున్ జోడీగా కైరా అద్వాని?

  • 'భరత్ అనే నేను'తో క్రేజ్ తెచ్చుకున్న కైరా 
  • ప్రస్తుతం చరణ్ సినిమాతో బిజీగా 
  • త్రివిక్రమ్ మూవీలో చేసే అవకాశం

కొంతకాలంగా అల్లు అర్జున్ కి చెప్పుకోదగిన హిట్ లేదు. దాంతో ఈ సారి తాను చేసే సినిమా తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. కొంతమంది దర్శకులు కథలు వినిపించినా, ఆయన ఆ ప్రాజెక్టులపై పెద్దగా ఆసక్తిని చూపలేదు. 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలతో తనకి రెండు హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు.

అందుకోసమే 'అరవింద' పూర్తయ్యేవరకూ వెయిట్ చేశాడు. త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి అంగీకరించడంతో, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కైరా అద్వానిని ఎంపిక చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో మహేశ్ తో కలిసి 'భరత్ అనే నేను' చేసిన కైరా .. ప్రస్తుతం చరణ్ తో చేస్తోంది. అల్లు అర్జున్ జోడీగా ఆమె ఎంపిక దాదాపు ఖరారైపోయిందని చెప్పుకుంటున్నారు. 

Allu Arjun
kiara adwani
  • Loading...

More Telugu News