Talasani: వచ్చే ఎన్నికల్లో 101 స్థానాల్లో విజయం సాధిస్తాం: మంత్రి తలసాని

  • రాణిగంజ్ లో హమాలీలను కలిసిన తలసాని
  • దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ అభివృద్ధి  
  • దొంగల కూటమే ‘మహాకూటమి’గా అవతరించింది

తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 101 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని మంత్రి, టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని రాణిగంజ్ లో హమాలీలను తలసాని కలిశారు. వారితో కలిసి టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ కు మద్దతుగా ఉండాలని, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దే అని కొనియాడారు. ఈ సందర్భంగా ‘మహాకూటమి’పై ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారని, దొంగల కూటమే ‘మహాకూటమి’గా అవతరించిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Talasani
TRS
101 seats
  • Loading...

More Telugu News