Chandrababu: చంద్రబాబుకు ఆ రెండు మాత్రమే తెలుసు.. జేసీని సీమ ప్రజలు బహిష్కరించాలి: శ్రీకాంత్ రెడ్డి

  • చంద్రబాబుకు అధర్మం, అన్యాయం మాత్రమే తెలుసు
  • జగన్ సొంత జిల్లాలో ఆయనను విమర్శించడం సరికాదు
  • సీమ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి

ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధర్మం, అన్యాయం మాత్రమే తెలుసని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. జగన్ సొంత జిల్లా కడపలో ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు మాట్లాడటం సరికాదని అన్నారు. ప్రొద్దుటూరులో జగన్ ను లక్ష్యంగా చేసుకుని అధర్మపోరాట దీక్షను నిర్వహించారని మండిపడ్డారు. కడప జిల్లాలో రైతులు ఇబ్బందులు పడుతుంటే... చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పారు.

గతంలో రాహుల్ ను తిట్టిన చంద్రబాబు... ఇప్పుడు అదే నోటితో పొగుడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మోదీని పొగిడిన నోటితోనే ఇప్పుడు తిడుతున్నారని అన్నారు. ఎన్నిసార్లు ఇలా యూటర్న్ లు తీసుకుంటారని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జేసీ దివాకర్ రెడ్డిని రాయలసీమ ప్రజలు బహిష్కరించాలని అన్నారు. 

Chandrababu
jagan
srikanth reddy
  • Loading...

More Telugu News