Jagan: నిందితుడు శ్రీనివాస్ కు నార్కో అనాలసిస్ పరీక్ష నిర్వహించాలి: వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

  • నార్కో అనాలసిస్ నిర్వహిస్తే నిజాలు బయటపడతాయి
  • జగన్ ని విమర్శించేందుకే నిన్న టీడీపీ సభ పెట్టారు  
  • అధర్మం, అన్యాయాలకి బాబు బ్రాండ్ అంబాసిడర్

వైసీపీ అధినేత జగన్ పై కత్తి దాడికి పాల్పడ్డ నిందితుడు శ్రీనివాస్ కు నార్కో అనాలసిస్ పరీక్ష నిర్వహిస్తే అసలు నిజాలు బయటపడతాయని ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడు జగన్ పై దాడి జరిగి వారం రోజులు కూడా కాలేదని,  ఇంకా ఆయన కోలుకోలేదని అన్నారు. నిన్న ప్రొద్దుటూరులో ధర్మపోరాటసభను జగన్ ని విమర్శించడం కోసమే టీడీపీ నిర్వహించినట్టు ఉందని అన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి లాంటి వారితో జగన్ ని పదేపదే తిట్టిస్తూ చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధర్మం, న్యాయం, చట్టం, నీతి ఈ నాల్గింటిని చంద్రబాబు తొక్కిపెట్టారని, ఆయనకు తెలిసిందల్లా అధర్మం, అన్యాయం, చట్టవిరుద్ధం, అవినీతి మాత్రమేనని అన్నారు. ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్న వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని ఆరోపించారు.

Jagan
YSRCP
mla srikanth reddy
  • Loading...

More Telugu News