raghuveera reddy: ఏపీలో టీడీపీతో పొత్తుపై రఘువీరారెడ్డి స్పందన!

  • ఏపీ ప్రజలు రాహుల్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు
  • పప్పు అన్న రాహుల్.. ఇప్పుడు నిప్పులా మారారు
  • టీడీపీతో పొత్తు అంశాన్ని అధిష్ఠానం చూసుకుంటుంది

72 శాతం మంది ఆంధ్ర ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానిగా కోరుకుంటున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. పప్పు అంటూ కొందరు విమర్శించిన రాహుల్... ఇప్పుడు నిప్పు అయ్యారని చెప్పారు. ఏపీలో అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని అధిష్ఠానం చెప్పిందని అన్నారు. రాష్ట్రంలో టీడీపీతో పొత్తు అంశాన్ని హైకమాండే చూసుకుంటుందని... పార్టీ పెద్దల ఆదేశాలను తాము పాటిస్తామని తెలిపారు. ఎన్నికలకు రెండు నెలల ముందు చిరంజీవి ప్రచారానికి వస్తారని చెప్పారు. జగన్ పై దాడి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయని అన్నారు. దాడి ఘటనను టీడీపీ, వైసీపీ, బీజేపీలు రాజకీయాలకు వాడుకుంటున్నాయని చెప్పారు.

raghuveera reddy
congress
Telugudesam
alliance
Andhra Pradesh
Rahul Gandhi
  • Loading...

More Telugu News