Jagan: జగన్ పై దాడి వ్యవహారం.. టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై పోలీసులకు వైసీపీ ఫిర్యాదు!

  • కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు పీఎస్ లో ఫిర్యాదు
  • అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత
  • గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, నేతలు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడికి కుటుంబ సభ్యులే కుట్ర పన్నారని ఆరోపించిన టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఇబ్బందుల్లో పడ్డారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, తాజాగా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది.  కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో రాజేంద్ర ప్రసాద్ పై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. జగన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ నేత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

జగన్ ను అడ్డు తొలగించుకోవాలని భావించి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలే ఈ దాడి చేయించారని టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. జగన్ పై జరిగిన దాడి ఘటనపై చాలా అనుమానాలు కలుగుతున్నాయని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ తో పాటు సీఎం చంద్రబాబు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్ ఆ తరహా వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని జూపూడి వ్యాఖ్యానించారు.

Jagan
Andhra Pradesh
YSRCP
Telugudesam
Police
complaint
rajendra prasad
  • Loading...

More Telugu News