Rahul Gandhi: సర్దార్‌ జీ కాంగ్రెస్‌ వాది కావడం గర్వంగా ఉంది: ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ

  • 565 సంస్థానాలు రక్తపాత రహితంగా విలీనం చేసిన ఉక్కుమనిషి
  • వల్లభాయ్‌ పటేల్‌ సాహసం, చొరవ అమోఘం
  • జాతి జనుల గుండెల్లో ఆయనకు చిరస్మరణీయ స్థానం

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పక్కా కాంగ్రెస్‌ వాది అని ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. భారత ప్రథమ ఉప ప్రధానిగా, హోం మంత్రిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. 565 సంస్థానాలను రక్తపాత రహితంగా భారత్‌లో విలీనం చేసిన సాహసం, చొరవ ఆయనకే సాధ్యమయిందని, అందుకే ఆయన ఉక్కుమనిషిగా గుర్తింపు పొందారని తెలిపారు. జాతిజనుల గుండెల్లో ఆయనకు సుస్థిర స్థానం ఉందన్నారు. అంతటి మహా నాయకుడు కాంగ్రెస్‌ వాది కావడం గర్వంగా ఉందని, ఆయన జయంతి సందర్భంగా భారత మాత ముద్దు బిడ్డకు సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు.

Rahul Gandhi
vallabhai patel
  • Error fetching data: Network response was not ok

More Telugu News