l ramana: మేము కన్నెర్ర చేస్తే.. కేసీఆర్ కుటుంబం కాలగర్భంలో కలసిపోతుంది: ఎల్.రమణ

  • టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి
  • టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు నిలదీస్తున్నారు
  • టీడీపీ నేతలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది

తెలంగాణలోని టీడీపీ నేతలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు నిలదీస్తున్నారని... ఏమీ చేయకుండానే మళ్లీ ఓట్లు అడిగేందుకు ఎందుకు వచ్చావంటూ ప్రశ్నిస్తున్నారని అన్నారు. తాము కన్నెర్ర చేస్తే కేసీఆర్ కుటుంబం కాలగర్భంలో కలసిపోతుందని చెప్పారు. ఈరోజు మహాకూటమి నేతలు హైదరాబాదులో భేటీ అయ్యారు. అనంతరం రమణ మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగానే తామంతా కూటమిగా ఏర్పడ్డామని చెప్పారు. తమ మేనిఫెస్టోను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. విపక్ష నేతలను భయపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు.

l ramana
kcr
Telugudesam
TRS
mahakutami
chada venkat reddy
cpi
  • Loading...

More Telugu News