Andhra Pradesh: కత్తి దాడి ఘటనపై పార్వతీపురం బహిరంగ సభలో మాట్లాడనున్న జగన్!

  • వచ్చే నెల 6న మొదలుకానున్న యాత్ర
  • ఏర్పాట్లు చేసుకుంటున్న వైసీపీ శ్రేణులు
  • 6న పార్వతీపురంలో బహిరంగ సభ

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర వచ్చే నెల 3 నుంచి తిరిగి ప్రారంభమవుతుందని వైసీపీ నేతలు తెలిపారు. నవంబర్ 6న పార్వతీపురంలో జగన్ బహిరంగ సభ నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ సభలో తనపైన జరిగిన దాడిపై జగన్ మాట్లాడతారని పేర్కొన్నారు.

దీపావళి పండుగ సందర్భంగా వచ్చే నెల 7,8,9 తేదీల్లో పాదయాత్రకు విరామం ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తిరిగి నవంబర్ 10న ప్రజా సంకల్పయాత్ర మొదలవుతుందని పేర్కొన్నారు. వచ్చే నెల 17న జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశిస్తుందని తెలిపారు.

గత గురువారం హైదరాబాద్ కు వస్తున్న జగన్ పై వైజాగ్ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ జగన్ హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ లో ఆపరేషన్ చేయించుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును సిట్ అధికారులు నాలుగో రోజు విచారిస్తున్నారు. 

Andhra Pradesh
Jagan
YSRCP
parvathipuram
meeting
november
3rd
november 6
  • Loading...

More Telugu News