lakshmi parvathi: లక్ష్మీపార్వతిని చూస్తుంటే జాలి వేస్తోంది.. ఢిల్లీ రాక్షసుల భరతం పడతా: శివాజీ

  • శివాజీని టీడీపీ నేతలు చంపేస్తారన్న లక్ష్మీపార్వతి
  • నిజాన్ని ప్రపంచానికి వెల్లడించేందుకు చావుకైనా సిద్ధమేనన్న శివాజీ
  • లక్ష్మీపార్వతి ఎన్ని మాట్లాడినా.. ఆమెకు వైసీపీ పదవులు ఇవ్వదు

'ఆపరేషన్ గరుడ' నేపథ్యంలో హీరో శివాజీని టీడీపీ నేతలు చంపేస్తారని... ఈ రాజకీయ ఉచ్చు నుంచి ఆయన తప్పుకోవాలని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యల పట్ల శివాజీ అదే స్థాయిలో స్పందించాడు. చావుకు భయపడేంత పిరికివాడిని తాను కాదని అన్నాడు. తనకు చావంటే భయం లేదని... నిజాన్ని ప్రపంచానికి వెల్లడించేందుకు తాను దేనికైనా సిద్ధమేనని చెప్పాడు. లక్ష్మీపార్వతి తనపై జాలి చూపాల్సిన అవసరం లేదని... ఆమెను చూస్తుంటే తనకే జాలి వేస్తోందని ఎద్దేవా చేశాడు. వైసీపీకి అనుకూలంగా ఎన్ని వ్యాఖ్యలు చేసినా... ఆ పార్టీ తరపున ఆమెకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు దక్కవని అన్నాడు. రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేస్తున్న ఢిల్లీ రాక్షసుల భరతం పడతానని చెప్పాడు.

lakshmi parvathi
sivaji
actor
operation garuda
ysrcp
  • Loading...

More Telugu News