srinivas: కోడికత్తి శ్రీనివాస్ తో నాగూర్ వలీ ఫోన్ సంభాషణ.. అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు
- వంద మందితో ఎక్కువగా మాట్లాడిన శ్రీనివాస్
- పిడుగురాళ్ల మండలానికి చెందిన నాగూర్ వలీని విచారిస్తున్న సిట్
- నిన్ననే నాగూర్ వలీ అక్కను అదుపులోకి తీసుకున్న అధికారులు
విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాస్ ను సిట్ బృందం నాలుగోరోజు విచారిస్తోంది. విచారణలో భాగంగా దాదాపు వంద మందితో శ్రీనివాస్ ఫోన్ ద్వారా ఎక్కువగా మాట్లాడినట్టు అధికారులు గుర్తించారు. ఆ వంద మందిని విచారించే పనిలో సిట్ అధికారులు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పాతగణేషునిపాడు గ్రామానికి చెందిన నాగూర్ వలీని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ తో ఫోన్ ద్వారా సంభాషణలు జరిపినట్టు పక్కా ఆధారాలు ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకుని, విచారణ ప్రారంభించారు. మరోవైపు, నాగూర్ వలీ అక్క సైదాబీని కూడా ప్రకాశం జిల్లా కనిగిరిలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.