Pawan Kalyan: పవన్ కల్యాణ్ నుంచి పిలుపు వస్తే.. ఆలోచిస్తా: బీజేపీ నాయకురాలు, నటి మాధవీలత

  • చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమానిని
  • పవన్, వ్యక్తిత్వం, ఆలోచనలు చూసి ఆయనపై అభిమానం పెంచుకున్నా
  • బీజేపీ జాతీయ పార్టీ అనే అందులో చేరా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంత అభిమానమో సినీ నటి మాధవీలత ఎన్నో సార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె జనసేనలో చేరుతారని అందరూ భావించారు. అయితే, ఊహించని విధంగా ఇటీవల ఆమె బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను బీజేపీలో చేరినప్పటికీ పవన్ పై ఉన్న అభిమానం ఏ మాత్రం తగ్గదని చెప్పారు. చిన్నప్పటి నుంచి తాను చిరంజీవి అభిమానినని తెలిపారు. పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం, ఆయన ఆలోచనలను చూసి అతని పట్ల అభిమానం పెంచుకున్నానని చెప్పారు. బీజేపీ జాతీయ పార్టీ అని, ఒక యూనివర్శిటీ లాంటిదని, ఎన్నో నేర్చుకునే అవకాశం ఉంటుందని... ఆ ఉద్దేశంతోనే ఆ పార్టీలో చేరానని తెలిపారు. ఒక వేళ పవన్ కల్యాణ్ నుంచి పిలుపు వస్తే... ఆ పార్టీలో చేరే విషయమై ఆలోచిస్తానని చెప్పారు.

Pawan Kalyan
madhavi latha
bjp
janasena
tollywood
Chiranjeevi
  • Loading...

More Telugu News