jagan case: దాడి కేసు విచారణకు జగనే సహకరించడం లేదు : హోం మంత్రి చినరాజప్ప
- ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నా జగన్ వల్లే అడ్డంకులు
- ప్రాణహాని ఉందంటూ కస్టడీలో నిందితులు చెప్పడం సహజమే
- కేంద్ర ప్రభుత్వం టీడీపీని అణచివేసేందుకు కుట్రలు చేస్తోంది
విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నా విచారణకు ఆయనే సహకరించడం లేదని రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప అన్నారు. విమానాశ్రయంలోని వీవీఐపీ లాంజ్‌లో శ్రీనివాస్ అనే వ్యక్తి దాడిచేసిన ఘటన వెనుక నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన స్పష్టం చేశారు. విచారణకు జగన్ సహకరిస్తే అన్నీ తేలుతాయని చెప్పారు. ఇక, పోలీసు కస్టడీలో ఉన్న నిందితులు తమకు ప్రాణహాని ఉందని చెప్పడం సహజమని కొట్టిపారేశారు. టీడీపీని అణచి వేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.