BJP: సొంత ప్రభుత్వమే అన్యాయం చేస్తోంది.. కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎమ్మెల్యే

  • మధ్యప్రదేశ్‌లో అధికార పార్టీని వీడిన ఎమ్మెల్యే
  • కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంజయ్ శర్మ
  • బీజేపీకి ఎదురుదెబ్బేనంటున్న పరిశీలకులు

సొంత ప్రభుత్వమే తన నియోజకవర్గానికి అన్యాయం చేస్తోందన్న మనస్తాపంతో ఓ బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. తన నియోజకవర్గానికి సొంత సర్కారే తీవ్ర అన్యాయం చేస్తోందని తెండు ఖేడా నియోకవర్గ ఎమ్మెల్యే సంజయ్ శర్మ ఆరోపించారు. ఈ కారణంగానే కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించిన ఆయన.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకోగానే బీజేపీపై దుమ్మెత్తి పోశారు. శర్మ పార్టీని వీడడంతో ఆయన స్థానంలో ఎంపీ ఉదయ్ ప్రతాప్ సింగ్‌ను బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం. కాగా, గత ఎన్నికల్లో నర్మదాంచల్ ప్రాంతంలోని బ్రాహ్మణ ఓట్లు బీజేపీకి పడడంలో శర్మ కీలకపాత్ర పోషించారు. దీంతో ఆయన పార్టీ వీడడం పార్టీకి దెబ్బేనని అంటున్నారు.

BJP
Congress
Madhya Pradesh
Sanjay Sharma
  • Loading...

More Telugu News