Telangana: తెలంగాణలో డిసెంబర్ 7, 11 అధికారిక సెలవులు!

  • డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
  • 11న కౌంటింగ్
  • డిసెంబర్ లో అదనంగా రెండు సెలవులు

డిసెంబర్ నెలలో సాధారణంగా వచ్చే సెలవులకు అదనంగా మరో రెండు రోజుల పాటు సెలవులను ప్రకటిస్తూ, తెలంగాణ సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే డిసెంబర్ 7న, కౌంటింగ్ జరిగే 11వ తేదీన సెలవులు ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. పాఠశాలల యాజమాన్యాలు ఈ రెండు రోజుల్లో స్కూళ్లను తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.

Telangana
Holidays
Elections
  • Loading...

More Telugu News