Nellore District: నగ్నంగా వీడియో తీసుకుని పంపించు.. నీ కష్టాలు నేను తీరుస్తా: వివాహితను వేధించిన జ్యోతిష్యుడు

  • కష్టాలు తీరాలంటే 9 రోజులు పూజలు చేయాలి
  • నగ్న వీడియో పంపిస్తేనే పూజలు
  • వివాహితను వేధించిన ప్రబుద్ధుడు

కష్టాలు చెప్పుకునేందుకు వచ్చిన వివాహితను వేధించాడో ప్రబుద్ధుడు. జ్యోతిష్యం పేరుతో ఆమెను వేధించిన అతడిప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కపెట్టుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన వి.శంకర్‌రావు శాస్త్రి స్థానికంగా దివ్యసాయి జ్యోతిషాలయాన్ని నిర్వహిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న మన్నారుపోలూరుకు చెందిన ఓ వివాహిత అతడిని ఆశ్రయించింది. కష్టాలు తీరే మార్గం చెప్పాలని కోరింది.

అన్నీ విన్న శంకర్‌రావు శాస్త్రి పూజలు చేయాలంటూ కొంత డబ్బు తీసుకున్నాడు. అనంతరం ఆమెకు పలుమార్లు ఫోన్ చేసిన శంకర్‌రావు.. కష్టాలు తీరాలంటే 9 రోజులు పూజచేయాలని పేర్కొన్నాడు. అయితే, అందుకు తొలుత నగ్నంగా వీడియో తీసుకుని తనకు పంపాలని, లేదంటే తన పడక గదిలో నగ్నత్వాన్ని చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. అంతేకాదు, అసభ్యంగా మాట్లాడేవాడు. వీటన్నింటినీ రికార్డు చేసిన వివాహిత పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని కటకటాల వెనక్కి పంపారు.

Nellore District
sullurpet
Andhra Pradesh
Police
  • Loading...

More Telugu News