Telangana: ఎన్నికల బరిలోకి విజయశాంతి.. దుబ్బాక నుంచి పోటీ

  • తొలుత ప్రచారానికే పరిమితం చేయాలని భావించిన అధిష్ఠానం
  • గెలుపు తథ్యమన్న బరిలోకి
  • తొలి జాబితాలో పేరు!

తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రచారానికే పరిమితం కావాలని భావించిన కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి మనసు మార్చుకున్నట్టు తెలిసింది. దుబ్బాక నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రకటించనున్న జాబితాలో ఆమె పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. విజయశాంతిని దుబ్బాక నుంచి పోటీలో నిలిపితే విజయం తథ్యమని భావించినందున కాంగ్రెస్ అధిష్ఠానమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

అధికారంలోకి వచ్చేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోవద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. చావో, రేవో అన్నట్టుగా తలపడుతున్న కాంగ్రెస్.. కచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం ఉన్న నేతలనే బరిలో నిలపాలని నిర్ణయించింది. నిజానికి కాంగ్రెస్ అధిష్ఠానం కూడా విజయశాంతిని తొలుత ప్రచారానికే పరిమితం చేయాలని భావించింది. అయితే, మారుతున్న ఓటర్ల నాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Telangana
Congress
Dubbaka
Medak District
Vijayashanti
  • Loading...

More Telugu News