Srinivasa Rao: శ్రీనివాసరావు ఫోను నుంచి ఎక్కువ కాల్స్ ఓ మహిళకు వెళ్లాయట.. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • కనిగిరిలో మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ
  • శ్రీనివాసరావుకు అంతా నార్మల్‌గా ఉందన్న వైద్యులు

వైసీపీ అధినేత జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు వేగవంతమైంది. శ్రీనివాసరావు ఫోన్ కాల్స్ లిస్టును పరిశీలించిన పోలీసులు అతని ఫోన్ నుంచి ఓ మహిళకు అధికంగా కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. దీంతో కనిగిరిలో ఆ మహిళను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా శ్రీనివాసరావుకు నేడు గుండెపోటు రావడంతో కేజీహెచ్‌కు తరలించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి అంతా నార్మల్‌గా ఉందని వెల్లడించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News