Chandrababu: చంద్రబాబుకు అఖిలేష్ ఫోన్.. విపక్షాలను ఏకం చేయడంపై చర్చ

  • బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలి
  • ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో పడ్డాయి
  • నాలుగేళ్లలోనే ఏపీ బాగా అభివృద్ధి చెందింది

కాంగ్రెస్ సహా విపక్షాలన్నింటినీ ఏకం చేయాలని, జాతీయ స్థాయిలో ఐక్యకూటమి ఆవశ్యకత తదితర అంశాలపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిందారు. నేడు చంద్రబాబుకు ఫోన్ చేసిన అఖిలేష్ బీజీపేయేతర భావజాలమున్న పార్టీలన్నీ ఏకతాటిపైకి తీసుకురావాలని కోరారు.

ప్రజాస్వామ్య విలువలు, లౌకిక వాదం ప్రమాదంలో పడ్డాయని వాటికి కాపాడలని అఖిలేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం నాలుగేళ్లలోనే ఏపీ బాగా అభివృద్ధి చెందిందని ప్రశంసించారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ముస్లింలలో అభద్రతా భావం పెరిగిందని అఖిలేశ్‌కు చంద్రబాబు వివరించారు. టీడీపీ ప్రయత్నాలకు సహకరించాలని కోరగా అఖిలేష్ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

Chandrababu
Congress
Akhilesh Yadav
BJP
Telugudesam
  • Loading...

More Telugu News