ys jagan: జగన్ పై దాడి కేసు నిందితుడిని కేజీహెచ్ కు తరలింపు

  • శ్రీనివాసరావుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు
  • విచారణలో ఉన్న వ్యక్తి అలసిపోవడం ఖాయం
  • ఫోన్ మెస్సేజ్ ల ఆధారంగా కేసు దర్యాప్తు సాగుతోంది

జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావును విశాఖలోని కేజీహెచ్ కు సిట్ అధికారులు తరలించారు. శ్రీనివాసరావుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి నలభై ఎనిమిది గంటలకొకసారి అతనికి వైద్య పరీక్షలు నిర్వహించాలని, విచారణలో ఉన్న వ్యక్తి అలసిపోవడం ఖాయమని  సిట్ అధికారి నాగేశ్వరరావు అన్నారు. ఫోన్ మెస్సేజ్ ల ఆధారంగా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తులో భాగంగా వివిధ రాష్ట్రాలకు బృందాలను పంపుతున్నామని, విశాఖ విమానాశ్రయ అథారిటీ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డిని విచారించామని చెప్పారు. నిందితుడి సహచర సిబ్బందిని మళ్లీ విచారిస్తున్నామని చెప్పారు.

ys jagan
srinivasrao
  • Loading...

More Telugu News