mysoora reddy: రాయలసీమకు అన్యాయం జరిగిందనే.. ఉద్యమం వస్తోంది: మైసూరారెడ్డి

  • రాయలసీమకు అనాదిగా అన్యాయం జరుగుతోంది
  • మిగులు జలాలు పంపిణీ చేయకపోవడం వల్లే సమస్యలు
  • చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం

సీనియర్ రాజకీయవేత్త మైసూరారెడ్డి రాసిన 'అస్తిత్వం-ఇది సంగతి' అనే పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించారు. హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మైసూరారెడ్డి మాట్లాడుతూ, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రాయలసీమకు అనాదిగా అన్యాయం జరుగుతూనే ఉందని అన్నారు. మిగులు జలాలను పంపిణీ చేయకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని చెప్పారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయం వల్ల ఉద్యమం వస్తోందని తెలిపారు. 

mysoora reddy
book
rayalaseema
  • Loading...

More Telugu News