harikrishna: కృష్ణా నదిలో తండ్రి అస్తికలను నిమజ్జనం చేసిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

  • బీచుపల్లి వద్ద అస్థికల నిమజ్జనం
  • భారీ ఎత్తున తరలి వచ్చిన అభిమానులు
  • దగ్గరకు రానివ్వని భద్రతా సిబ్బంది

తమ తండ్రి నందమూరి హరికృష్ణ అస్థికలను ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు నిమజ్జనం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం బీచుపల్లి వద్ద ఉన్న కృష్ణానదిలో వేదమంత్రోచ్ఛారణల మధ్య నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అయితే భద్రతా సిబ్బంది వారిని దగ్గరకు రానివ్వకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.  నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. 

harikrishna
junior ntr
kalyanram
asthikalu
  • Loading...

More Telugu News