Donald Trump: గొడుగును మూయలేక వదిలెళ్లిపోయిన ట్రంప్... నవ్వుకుంటున్న నెటిజన్లు... వీడియో!

  • ఇల్లినాయిస్‌లో జరుగుతున్న కార్యక్రమానికి బయలుదేరిన ట్రంప్
  • వర్షం వస్తుండటంతో గొడుగు పట్టుకుని విమానంలోకి
  • డోర్ వద్ద దాన్ని వదిలేసిన ట్రంప్

తన వింత చర్యతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి నవ్వులు పూయిస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో నెటిజన్లకు టార్గెట్ గా మారే ఆయన, ఇల్లినాయిస్‌లో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో బయలుదేరగా, వర్షం కురుస్తుండటంతో గొడుగు పట్టుకుని విమానం మెట్లు ఎక్కిన వేళ ఈ ఘటన జరిగింది. విమానం లోపలికి వెళ్లే వేళ, గొడుగును మూసేందుకు సాధ్యం కాకపోవడంతో, ద్వారం వద్దే దాన్ని పడేసిన ట్రంప్, లోపలికి వెళ్లిపోయారు.

ఆపై గాలికి ఆ గొడుగు అటూ ఇటూ తిరుగుతూ, విమాన ద్వారం వద్దే ఇరుక్కుపోయింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండగా, సరదా కామెంట్లు వస్తున్నాయి. "ట్రంప్‌ కు గొడుగును ఎలా మూసివేయాలో కూడా తెలీదు" అని ఒకరు, "చేతిలో ఉన్న గొడుగునే మూయలేదంటే బాత్ రూమ్‌ కు వెళితే ఫ్లష్‌ కూడా చేయరేమో" అని ఇంకొకరు, "ట్రంప్‌ తెల్లగా ఉంటారు. గొడుగు నల్లగా ఉంది కాబట్టే, ఆయన అందుకే పట్టించుకోకుండా వదిలేసుంటారు" అని ఇంకొకరు కామెంట్లు చేశారు. గతంలోనూ ట్రంప్ కు సంబంధించిన ఇటువంటి వీడియోలు వైరల్ అయ్యాయి.

Donald Trump
Umbrella
Illenois
Social Media
Viral Videos
  • Error fetching data: Network response was not ok

More Telugu News