Andhra Pradesh: నా టీడీపీ సభ్యత్వ కార్డును శ్రీనివాసరావుదిగా వైసీపీ నేతలు ఫోర్జరీ చేశారు.. మీడియా ముందుకొచ్చిన అంకాలు!

  • నేను చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానిని
  • చాలాకాలంగా టీడీపీ కార్యకర్తగా ఉన్నా
  • ఫోర్జరీ నిందితులపై చర్యలు తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై  కత్తిదాడి ఘటనలో తన టీడీపీ సభ్యత్వ కార్డును శ్రీనివాసరావుదిగా ఫోర్జరీ చేశారని నంబూరి అంకాలు తెలిపాడు. తాను చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానిననీ, టీడీపీ కార్యకర్తగా ఉన్నానని వెల్లడించారు. తనది నిరుపేద కుటుంబమనీ, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి తమదని పేర్కొన్నాడు. అలాంటి తన కార్డును నిందితుడు శ్రీనివాసరావుదిగా చూపడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

తన టీడీపీ సభ్యత్వ కార్డును దుర్వినియోగం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంకాలు డిమాండ్ చేశాడు. వైఎస్ జగన్ పై దాడిచేసిన శ్రీనివాసరావు టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నట్లు సభ్యత్వ కార్డును వైసీపీ నేతలు బయటపెట్టారు. అయితే ఇందుకు స్పందించిన టీడీపీ వర్గాలు.. అసలు కార్డు నంబూరి అంకాలుదని వెలుగులోకి తీసుకొచ్చాయి. ఆయన కార్డును ఫోర్జరీ చేసి శ్రీనివాసరావు పేరుతో నకిలీ కార్డును సృష్టించారని ఆరోపించాయి.

నంబూరి అంకాలు గుంటూరు జిల్లాలోని బాపట్ల నియోజకవర్గం గణపవరం గ్రామంలో ఉంటున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు. గిరిజనుడైన అంకాలు రోజువారీ కూలీగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని వెల్లడించారు. వైసీపీ నేతలు కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని విమర్శించారు.

Andhra Pradesh
Guntur District
Jagan
knife attack
Visakhapatnam District
airport
Telugudesam
Telugudesam
membership card
forgery
ankalu
namburi
  • Loading...

More Telugu News