Mukesh Ambani: కుమార్తె పెళ్లి శుభలేఖలను పంచడం ప్రారంభించిన ముఖేష్ అంబానీ!

  • ముంబై సిద్ధి వినాయకుడికి తొలి శుభలేఖ
  • కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన ముఖేష్
  • గత నెలలో వైభవంగా జరిగిన నిశ్చితార్థం

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, తన కుమార్తె ఇషా పెళ్లి శుభలేఖలను పంచడం ప్రారంభించారు. తన కుటుంబ సమేతంగా ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించిన ఆయన, తొలి శుభలేఖను స్వామివారి పాదాల ముందు ఉంచారు. ఆనంద్ పిరామల్ తో ఇషా అంబానీ వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే.

భారీ సెక్యూరిటీ మధ్య తల్లి కోకిలాబెన్, భార్య నీతా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీలతో దేవాలయానికి వచ్చిన ముఖేష్ కు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆపై స్వామికి ప్రత్యేక పూజలు జరిపించిన ముఖేష్, శుభలేఖను స్వామికి సమర్పించారు. ఇటలీలోని లేక్ కోమోలో సెప్టెంబర్ లో ఈషా, ఆనంద్ ల నిశ్చితార్థం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

Mukesh Ambani
Esha Ambani
Anand Piramal
Wedding Card
Engagement
  • Loading...

More Telugu News