Jagan: జగన్‌కు ముందే తెలుసు.. మానసికంగా సిద్ధమయ్యాకే దాడి జరిగింది: కాల్వ

  • డ్రామా రక్తి కట్టకపోవడంతో సీన్ ఢిల్లీకి మారింది
  • దాడికి పాల్పడిన వ్యక్తిపై చేయి చేసుకోనివ్వలేదు
  • వైసీపీ కుట్రను ప్రశ్నించాం

ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వైసీపీ అధినేత జగన్ దాడి విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు కాల్వ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు ఇక్కడ ఆడిన డ్రామా రక్తికట్టకపోవడంతో సీన్‌ను ఢిల్లీకి మార్చారని ఆయన విమర్శించారు. దాడి గురించి జగన్‌కు ముందే తెలుసన్నారు.

జగన్ మానసికంగా సిద్ధమయ్యాకే దాడి జరిగిందని.. అందుకే దాడి అనంతరం ఆయన మొహంలో ఎలాంటి హావభావాలూ లేవని అన్నారు. అంతేకాకుండా పోలీసు విచారణలో దాడికి పాల్పడిన వ్యక్తిపై జగన్ చేయి చేసుకోనివ్వలేదని వెల్లడైందని కాల్వ పేర్కొన్నారు. దాడి ఘటనను ఖండించామని.. కాకపోతే వైసీపీ కుట్రను తాము ప్రశ్నించామని ఆయన తెలిపారు.

Jagan
Kalva Srinivasulu
Delhi
YSRCP
  • Loading...

More Telugu News