hero shivaji: హీరో శివాజీని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలి: ఏపీ బీజేపీ నేత సుధీష్ రాంభొట్ల

  • ఏపీలో శాంతిభద్రతల సమస్య పెరిగింది
  • అమిత్ షా, కన్నా, జగన్ పై దాడులే నిదర్శనం
  • జగన్ పై దాడి ‘డ్రామా’ అని డీజీపీ చెప్పడం విడ్డూరం

‘ఆపరేషన్ గరుడ’పై విచారణ చేపట్టాలని, హీరో శివాజీని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని ఏపీ బీజేపీ నేత సుధీష్ రాంభొట్ల డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను ఏపీ బీజేపీ ప్రతినిధి బృందం కలిసింది. ఏపీలో శాంతిభద్రతల సమస్య పెరిగిందని, అమిత్ షా, కన్నా లక్ష్మీనారాయణ, వైఎస్ జగన్ పై దాడులు జరగడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. జగన్ పై దాడి ‘డ్రామా’ అని ఏపీ డీజీపీ చెప్పడం విడ్డూరంగా ఉందని, గవర్నర్ ఆరా తీస్తే టీడీపీ నేతలు ఎదురుదాడి చేయడం సరికాదని, జగన్ పై దాడి కేసు కేంద్రానికి అప్పగించాలని ఈ సందర్భంగా రాంభొంట్ల డిమాండ్ చేశారు.

hero shivaji
bjp
sudhish rambhotla
  • Loading...

More Telugu News