France: ఫ్రాన్స్ నుంచి వచ్చిన విద్యార్థినిపై స్నేహితురాలి తండ్రి అసభ్య ప్రవర్తన!

  • ఎక్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఢిల్లీలో శిక్షణ
  • తోటి విద్యార్థిని ఇంట్లో ఆశ్రయం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

ఎక్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఓ 16 ఏళ్ల విద్యార్థిని ఫ్రాన్స్ నుంచి భారత్‌కు వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో శిక్షణ పొందుతోంది. తనతో పాటు చదివే తోటి విద్యార్థిని ఇంట్లో ఆశ్రయం పొందింది. ఈనెల 18న జైపూర్ వెళ్లేందుకు ప్రయాణం అవుతోంది. ఈ క్రమంలో విద్యార్థినిపై కన్నేసిన సదరు స్నేహితురాలి తండ్రి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి తీవ్ర వేదనకు గురిచేశాడు. దీంతో ఆ విద్యార్థిని తన తోటి విద్యార్థులకు విషయాన్ని తెలిపి బాధపడింది.

విషయం ఉపాధ్యాయులకు తెలియడంతో ఆమెకు వేరే ఇంట్లో ఆతిథ్యం ఏర్పాటు చేసి ఆమె తల్లిందండ్రులకు, ఫ్రెంచ్ ఎంబసీకి విషయాన్ని తెలిపారు. అక్టోబర్ 23న సదరు స్నేహితురాలి తండ్రిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి అతడు కనిపించకుండా పోయాడని పోలీసు ఉన్నతాధికారి దేవేశ్ శ్రీవాత్సవ మీడియాకు తెలిపారు. 

France
India
Delhi
Jaipur
EXchange Programme
  • Loading...

More Telugu News