Madhu Yaskhi: అవినీతిలో ‘తెలంగాణ శశికళ’ ఎంపీ కవిత: మధు యాష్కీ

  • కవిత అవినీతి అంతాఇంతా కాదు
  • కేటీఆర్ అహంకారంతో ప్రవర్తిస్తున్నారు
  • కల్వకుంట్ల కుటుంబం అబద్ధాలకు మారుపేరు

ఈ నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎంపీ కవిత అవినీతి అంతాఇంతా కాదని టీ-కాంగ్రెస్ నేత మధు యాష్కీ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అవినీతి విషయంలో 'తమిళనాడు శశికళ'ను కవిత మించిపోయిందని, ఆమెను ‘తెలంగాణ శశికళ’ అని యావత్తు ప్రజలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు పైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు వారి ఆరాధ్యదైవమైన ఎన్టీఆర్ పేరును పెట్టుకున్న కేటీఆర్ అహంకారంతో ప్రవర్తిస్తున్నారని, ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని విమర్శించారు.
అధికారం కోసం గడ్డితినే కేసీఆర్ కుటుంబాన్ని సీమాంధ్రులు నమ్మవద్దని
గతంలో ఆంధ్రా వాళ్లంతా రాక్షసులు అని, వాళ్లకు సిగ్గూశరం లేదని కేటీఆర్ అనలేదా? అని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం అంటేనే అబద్ధాలకు మారుపేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రావాళ్లకే పనిచేస్తుందని, ఆ పార్టీని ఓడించాలని హరీష్ వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు.

Madhu Yaskhi
kcr
KTR
kavitha
ntr
  • Loading...

More Telugu News