team india: చెలరేగిన అంబటి రాయుడు.. వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యం

  • 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసిన టీమిండియా
  • సెంచరీలతో విరుచుకుపడ్డ రోహిత్, రాయుడు
  • 2 వికెట్లు తీసిన రోచ్

ముంబైలో జరుగుతున్న నాలుగో వన్డేలో వెస్టిండీస్ కు టీమిండియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 162, రాయుడు 100 పరుగులతో స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. ఇండియన్ బ్యాట్స్ మెన్లలో ధావన్ 38, కోహ్లీ 16, ధోనీ 23, జాధవ్ 16, జడేజా 7 పరుగులు చేశారు. జాధవ్, జడేజాలు నాటౌట్ గా నిలిచారు. విండీస్ బౌలర్లలో రోచ్ 2 వికెట్లు, నర్స్, కీమో పాల్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో వన్డేల్లో రోహిత్ శర్మ 21వ సెంచరీ చేయగా, రాయుడు మూడో శతకాన్ని నమోదు చేశాడు. 81 బంతుల్లో 100 పరుగులు చేసిన రాయుడు రనౌట్ గా వెనుదిరిగాడు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News