cbi: అస్థానాపై ఆరోపణల కేసు.. ‘సుప్రీం’ను ఆశ్రయించిన సానా సతీశ్!

  • అస్థానాపై సానా సతీశ్ ఆరోపణల కేసు
  • సతీశ్ ను ప్రశ్నించేందుకు సీబీఐ సమన్లు జారీ
  • రక్షణ కల్పించాలని కోరుతూ ‘సుప్రీం’లో సతీష్ పిటిషన్

మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషితో ముడిపడి ఉన్న కేసులో తన పేరును తప్పించేందుకు రాకేశ్ అస్థానా లంచం తీసుకున్నారని హైదరాబాద్ వ్యాపారి సానా సతీశ్ బాబు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సతీశ్ ను ప్రశ్నించేందుకు సీబీఐ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో తనకు మధ్యంతర రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సతీశ్ పిటిషన్ దాఖలు చేశారు.

కాగా, రూ.5 కోట్లు లంచం ఇస్తే సీబీఐ సమన్ల నుంచి ఊరట కలిగిస్తానని మనోజ్ ప్రసాద్ అనే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ తనకు హామీ ఇచ్చారని సతీశ్ తన వాంగ్మూలంలో ఆరోపించారు. లండన్ లో అస్థానా పెట్టుబడులను తన సోదరుడు సోమేశ్ ప్రసాద్ పర్యవేక్షిస్తుంటాడని మనోజ్ ప్రసాద్ తనకు చెప్పారని, పలు దర్యాప్తు సంస్థల అధికారులతో మనోజ్ ప్రసాద్ కు పరిచయాలున్నట్టు తనకు ఆయన చెప్పారని సానా సతీశ్ బాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ వాంగ్మూలం ఆధారంగా అస్థానాపై కేసు నమోదు కావడం తెలిసినదే.

  • Loading...

More Telugu News